NTR : టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం ”వార్ 2” సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ముంబై చేరుకున్నారు. ఈరోజు ముంబై ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ మెరిశారు.. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం ఎన్టీఆర్ ముంబైకి వెళ్లారు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.