ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా ‘దేవర’. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలై ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమా ప్రస్తుతం నవంబర్ 8 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎన్టీఆర్ ఈ సినిమాతో ఓటిటిలో కూడా రికార్డులు సృష్టిస్తున్నాడు. అయితే ఓటీటీలో కూడా దేవర మిలియన్ వ్యూస్ సాధిస్తోంది.నెట్‌ఫ్లిక్స్ ఇటీవలే ఈ వారం భారతదేశంలోని టాప్ టెన్ సినిమాల జాబితాను విడుదల చేసింది. అందులో ఈ సినిమా నంబర్ వన్ ట్రెండింగ్‌లో నిలించింది.