Homeహైదరాబాద్latest Newsలక్ష్మీపూర్ లో అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం

లక్ష్మీపూర్ లో అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం

దే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పౌష్టికాహారం కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి డిస్ప్లే చేయడం జరిగింది.వాటిలో ఉండే పోషక విలువల గురించి వివరించడం జరిగింది.సూపర్వైజర్ జానకి మాట్లాడుతూ మొలకెత్తిన గింజలు,తాజాఆకుకూరలు పండ్లు సీజనల్ ఫ్రూట్స్,చిరుధాన్యాలు రోజు తినే ఆహారంలో భాగంగా తీసుకోవాలని వివరించడం జరిగింది.ప్రతి ఒక్కరు వారి వారి ఇండ్లలో న్యూట్రిక్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జానకి,యుపిఎస్ హెచ్ఎం పూర్ణచందర్,రమేష్,అంగన్వాడి టీచర్ స్వప్న, ఆశాలు లక్ష్మీ, రాధ, గర్భిణీ, బాలింతలు, తల్లులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img