నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం పోలింగ్ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిస్ వజ్ ఆర్ సమక్షంలో పూర్తి చేశారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్. ఐ. సి హాల్ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు.