ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ పూర్తిగా గోల్డ్ తో తయారు చేయబడవు. 529 గ్రాముల బరువున్న ఈ మెడల్లో అసలు గోల్డ్ 6 గ్రాములు (1.3%) మాత్రమే ఉంటుంది. మిగిలినది వెండితో చేయబడింది. మెడల్ పైన గోల్డ్ పొర ఉంటుంది. పారిస్ ఒలింపిక్స్ 2024 బంగారు మెడల్లో 6 గ్రాముల గోల్డ్ తో పాటు ఐఫిల్ టవర్ నుంచి సేకరించిన ఇనుము ముక్కల్ని సైతం పొందుపరిచారు. చివరిగా 1912 ఒలింపిక్స్లో పూర్తిగా బంగారంతో చేసిన పతకాలను అందించారు.