ఒడిశా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ గంజాం జిల్లాలోని హింజిలి అసెంబ్లీ స్దానం నుంచి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు సీనియర్ నేతలు ఉన్నారు. కంతబంజి, హింజిలి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి CM నవీన్ పట్నాయక్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు మే 13 నుంచి జూన్ 1 వరకూ ఒడిషా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఒడిషాలో ప్రధానంగా బీజేపీ, బీజేడీ మధ్య పోటీ నెలకొనగా కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.