– అప్పుడే ప్రజాపాలన విజయవంతం
– ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడకుల అశోక్
ఇదే నిజం ములుగు ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమానికి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉండాలని ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడకుల అశోక్ కోరారు. అప్పుడే ప్రజా పాలన విజయవంతం అవుతుందని చెప్పారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పైడకుల అశోక్ మీడియాతో మాట్లాడుతూ.. వార్డ్ మెంబర్లు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సహకార సంఘం డైరెక్టర్ లు, చైర్మన్ లు అందరూ అందుబాటులో ఉండాలని కోరారు.