ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ పట్టణంలో సోమవారం నాడు మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధికి కావలసిన నిధులు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి, నిధులు తెచ్చి పట్టణం అభివృద్ధి చేసుకుందాం. ప్రతి వార్డులో సమస్యలను అడిగి తెలుసుకోని పరిష్కారించాలని అన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందించడంతో పాటు చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి వార్డులో 24 గంటల విద్యుత్ నిరంతరంగా అందేలా అధికారులు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. ప్రస్తుతం ఈదురు గాలుల వల్ల కరెంటు తీగలపై చెట్లను పడకుండా ముందస్తుగానే చెట్లను తొలగించాలని అధికారులను సూచించారు. పట్టణ అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు..బదిలీ లో వెళుతున్న అధికారులను ఎమ్మెల్యే శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా,మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్యా దేవేందర్ నాయక్,కాంగ్రెస్ పార్టీ నాయకులు హన్మంతు వెంకటేష్, పట్టణ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.