Homeహైదరాబాద్latest Newsసమయపాలన పాటించని అధికారులు.. ఇష్టానుసారంగా విధులకు హాజరు..!

సమయపాలన పాటించని అధికారులు.. ఇష్టానుసారంగా విధులకు హాజరు..!

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో, మండల పరిషత్ కార్యాలయంలో కొంత మంది అధికారులు 11:00 వరకు కూడా విధులకు హాజరు కాకపోవడంతో కొన్ని ఖాళీ సీట్లు దర్శనమిచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలన్ని ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా మండల పరిషత్ కార్యాలయంలో 11:00 దాటిన అధికారుల కుర్చీలు కొన్ని ఖాళీగానే దర్శనమిచ్చాయి.
మండల ప్రజలు మండల పరిషత్ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన పలు గ్రామాల ప్రజలు చేసేదేమీ లేక ఎప్పుడు వస్తారో అంటూ ఎదురు చూస్తూ కూర్చున్నారు. అధికారులు సమయానికి రాకుండా ఇష్టానుసారంగా హాజరు కావడాన్ని ఉన్నతాధికారులు కూడా పట్టించుకోకపోవడంతో యథా రాజా తథా ప్రజా అనే విధంగా తయారయింది. దీంతో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. మండల గ్రామాలలో ప్రజలు సమస్యలు చెప్పుకుందామని మండల కార్యాలయాలకు వస్తే అధికారులకు కుర్చీలన్నీ కొన్ని శాఖలలో ఖాళీగానే దర్శనం ఇస్తాయి. ఇప్పటికైనా ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ కార్యాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img