Homeహైదరాబాద్latest Newsఇదే నిజం వార్తకు స్పందించిన అధికారులు.. జగ్గాసాగర్ గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

ఇదే నిజం వార్తకు స్పందించిన అధికారులు.. జగ్గాసాగర్ గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

  • గ్రామంలో నెలకొన్న పరిస్థితి పై వైద్య సిబ్బందిని ఆరా తీసిన కలెక్టర్
  • మళ్ళీ ఇంటింటా సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ
  • వైద్య సేవలు మెరుగుపరచాలని కోరిన గ్రామస్థులు

ఇదే నిజం, మెట్ పల్లి రూరల్: మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ లో తగ్గని విష జ్వరాలు అనే ‘ఇదే నిజం’ కథనానికి స్పందన లభించింది. శనివారం జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. గ్రామపంచాయతి వద్ద వైద్య సిబ్బందితో గ్రామంలో నెలకొన్న పరిస్థితుల గురించి ఆరా తీశారు. వైద్య సిబ్బంది ఇంటింటా తిరుగుతూ విష జ్వరాలపై సర్వే చేసినప్పటికీ వ్యాధికి గల కారణాలు తెలియట్లేదు అని కలెక్టర్ కు తెలిపారు. సర్వే చేసిన వివరాలను కలెక్టర్ చూయించారు.రోగుల్లో చికెన్ గున్యా లక్షణాలు కనిపించినప్పటికీ పరీక్షల్లో నిర్దారణ కావట్లేదు అని తెలిపారు. గ్రామస్థుల నమూనాలను జిల్లా ఆస్పత్రిలో చికెన్ గున్య పరీక్షలు ప్రత్యేక చేయిస్తున్నామని కలెక్టర్కు తెలిపారు.

అదేవిధంగా గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రస్తుత పరిస్థితులు చక్కబడే వరకు మరో ఇద్దరు వైద్యులను నియమించాలని, ఆరోగ్య కేంద్రం యొక్క సమయ పాలనను సడలించాలని స్థానికులు కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పదిస్తూ జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు జారీ చెశారు. అంతేకాకుండా మళ్ళీ ఇంటింటా సర్వే చేయాల్సిందిగా వైద్య సిబ్బందికి ఆదేశించారు. మళ్ళీ వారం తరువాత గ్రామాన్ని సందర్శిస్థానని తెలిపారు. గ్రామంలో నెలకొన్న పరిస్థితులు చక్కబడేట్లు అధికారులు పని చేయాలని సూచించారు. కలెక్టర్ వెంబడి ఆర్డివో నక్క శ్రీనివాస్,జిల్లా వైద్యాధికారి శ్రీధర్, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంపీవో మహేశ్వర్ లు స్థానిక నాయకులు భోగ గంగాధర్, పుల్ల జగన్, కొమ్ముల రాజ్పాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img