గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరుగనుంది. పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి హాజరుకానున్నారు. అలాగే ఈవెంట్ కి ‘OG’ డైరెక్టర్ సుజీత్ కూడా రాబోతున్నారు. అయితే ఈవెంట్ లో ‘OG’ సినిమాకి సంబందించిన భారీ అప్డేట్ ని డైరెక్టర్ సుజీత్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో పవన్ ఫాన్స్ కి శుభవార్త అనే చెప్పాలి. ఈ వార్త విన్న మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు.