ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయినిగా నటించిన సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఆరు భాషల్లో డిసెంబర్ 5న థియేటర్లో రిలీజ్ కానుంది. అయితే ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ రష్మిక మందన్న అనే వార్త కొద్దిరోజులుగా ప్రచారంలో ఉంది. పుష్ప 2 కోసం రష్మిక 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో, రష్మిక తన పారితోషికం గురించి మాట్లాడిన విషయం వైరల్ అవుతోంది.
గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2024 కార్యక్రమానికి హీరోయిన్ రష్మిక మందన్న హాజరయ్యారు. ‘పుష్ప 2’ మూవీ కోసం మీరు భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి.. దీనిపై మీ స్పందన ఏంటి అని రష్మిక ని యాంకర్ అడిగాడు. దానికి రష్మిక చిరునవ్వుతో బదులిస్తూ.. ‘అలాంటి రూమర్స్‌తో నేను అస్సలు ఏకీభవించను, ఎందుకంటే అవి నిజం కాదు. ‘పుష్ప 2’ మూవీ కోసం నాకు రూ. 2 కోట్లు మాత్రమే పారితోషికం తీసుకున్నట్లు తెలిపారు. పుష్ప-2కి జాతీయ అవార్డు వస్తుందని భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు.. ‘అది వస్తుందని ఆశిస్తున్నా’ అని సమాధానమిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 12,000 థియేటర్లలో పుష్ప 2 విడుదల కానుంది. అల్లు అర్జున్ సినిమా మూడేళ్ల తర్వాత విడుదల కానుండడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.