Homeసినిమాప్రియాంకకు ఓజీ టీమ్ బర్త్ డే విషెస్

ప్రియాంకకు ఓజీ టీమ్ బర్త్ డే విషెస్

నాని నటించిన గ్యాంగ్ లీడర్​ సినిమాతో టాలీవుడ్​కు ఎంట్రీ ఇచ్చింది మలయాళీ భామ ప్రియాంక అరుల్ మోహన్. తెలుగు, తమిళ్​ సినిమాల్లో నటించిన ప్రియాంక తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పవన్​ కల్యాణ్​ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తున్న ‘ఓజీ’,నాని హీరోగా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తీస్తున్న‘సరిపోదా శనివారం’సినిమాల్లో ఆమె నటిస్తోంది. అయితే, సోమవారం ప్రియాంక అరుల్ మోహన్ బర్త్ డే కావడంతో ఈ రెండు సినిమాల టీమ్స్​ ఆమెకు విషెస్ తెలుపుతూ స్పెషల్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు ఆడియెన్స్​ను ఆకట్టుకుంటున్నాయి.

Recent

- Advertisment -spot_img