Ola Scooters : 1,441 ఓలా ఎలక్ట్రిక్ ఈ-స్కూటర్లు వెనక్కి
Ola Scooters : దేశ ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలపై ఇప్పుడిప్పుడే ఆసక్తి పెంచుకుంటూ కొనుగోళ్లు జరుపుతున్నారు.
ఈ సానుకూల పరిణామం వల్ల కాలుష్యం తగ్గుతుందని, పెట్రోలు వినియోగం, దిగుమతులు తగ్గుతాయని భావిస్తోన్న వేళ అనేక ప్రాంతాల్లో ఈ-బైక్‌ల పేలుళ్లు కలకలం రేపుతున్నాయి.
వాటి బ్యాటరీల నాణ్యత, ఇతర కారణాలు ఈ ప్రమాదాలకు కారణాలని నిపుణులు చెబుతోన్న వేళ ఓలా ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం తీసుకుంది.
పూణెలో ఇటీవల జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని 1,441 యూనిట్ల ఈ-బైక్‌లను రీకాల్ (వెనక్కి పిలిపించడం) చేస్తున్నట్లు తెలిపింది.
ఇటీవల ప్రమాదానికి గురైన ఈ-స్కూటర్ తో పాటు ఆ బ్యాచ్‌లో తయారయిన అన్ని బైక్‌లనూ పరిశీలించాలని నిర్ణయించినట్లు ఓలా తెలిపింది.
అందుకే ఆ బైక్‌లను వెనక్కి పిలిపిస్తున్నట్లు వివరించింది.
ఆ స్కూటర్లలోని బ్యాటరీలు, థర్మల్ వ్యవస్థలపై తమ సర్వీస్ ఇంజనీర్లు సమీక్ష నిర్వహిస్తారని చెప్పింది.
భారత బ్యాటరీ ప్రమాణాలతో పాటు ఐరోపా ప్రమాణాలకు కూడా తమ స్కూటర్లలో అమర్చిన బ్యాటరీలు సరిపోతాయని తెలిపింది.
Overheating Laptop : ల్యాప్టాప్ వేడెక్కుతుందా.. ఏం చేయాలి..
Electric Plug : ప్లగ్గులో మూడో పిన్ ఎందుకు, ఉపయోగాలు ఏంటి..