సాధారణంగా వేసవి కాలంలో ఎండలు మండిపోతుంటాయి. కానీ.. ఇప్పుడు వర్షాకాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి.
సెంచరీ దాటాయి. బండిని బయటికి తీయాలంటేనే జనాలు భయపడిపోతున్నారు.
పెట్రోల్ ధరలు ఇలా రోజురోజుకూ ఎగబాకుతుంటే.. బైక్‌ను బయటికి తీసేదెలా? పెట్రోల్‌తో తప్పితే.. వేరే ఇంధనం వాడి.. లేదా వేరే టెక్నాలజీని వాడి.. బైక్స్‌ను నడపలేమా? ఆ ఆలోచన నుంచి వచ్చిందే.. ఎలక్ట్రిక్ బైక్. ఇప్పుడు ఇదే ట్రెండ్.
ఇదివరకు కూడా చాలా ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్‌లోకి వచ్చాయి కానీ.. తాజాగా విడుదలైన రెండు ఎలక్ట్రిక్ బైక్స్ మాత్రం వాహనదారులును తెగ ఆకట్టుకుంటున్నాయి. అవే.. ఒకటి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్, రెండోది సింపుల్ వన్ ఈ బైక్.
ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ లాంచ్ కాగానే.. అందరి కన్ను వాటి మీద పడటానికి కారణం.. వాటి ఫీచర్స్. ఇప్పటి వరకు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో లేని బెస్ట్ ఫీచర్స్ ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో అందుబాటులోకి రావడంతో.. వాహనదారులు.. వాటివైపు మళ్లుతున్నారు.
అయితే.. ఒకే రోజు రెండు కంపెనీల నుంచి ఎలక్ట్రిక్ బైక్స్ రిలీజ్ కావడంతో.. ఏ బైక్ అయితే బెస్ట్ అనేది వాహనదారులు తేల్చుకోలేకపోతున్నారు. ఓలా బెస్టా? లేక.. సింపుల్ వన్? అనేది తేల్చుకోలేకపోతున్నారు. అటువంటి వారి కోసమే ఈ ఆర్టికల్. సింపుల్‌గా వాటి ఫీచర్స్‌ను, ఇతర ఫెసిలిటీలను కంపేర్ చేద్దాం. మీకు ఏ ఫీచర్స్ నచ్చితే దాన్ని కొనుగోలు చేయండి.
Booking fees
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఎస్1, ఎస్1 ప్రో అనే రెండు మోడల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఎస్1 మోడల్ ధర.. రూ.99,999 కాగా.. ఎస్1 ప్రో మోడల్ ధర.. 1,29,999 రూపాయలు. అయితే.. ఓలా ఎస్1 స్కూటర్‌ను కేవలం రూ.499 కట్టి బుక్ చేసుకోవచ్చు.
అదే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అయితే.. రూ.1947 పే చేసి బుక్ చేసుకోవాలి. అయితే.. సింపుల్ వన్.. ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కేవలం రూ.1,09,999 మాత్రమే.
Mileage
మైలేజ్ పరంగా చూసుకుంటే.. ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఎస్1 ప్రో 181 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఎస్1 మోడల్ మాత్రం 121 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
రీప్లేస్ అవసరం లేని.. 2.98 కిలోవాట్స్, 3.97 కిలోవాట్స్ బ్యాటరీలు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు వస్తాయి.
అదే.. సింపుల్ వన్ స్కూటర్ మాత్రం ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 236 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దానికి 4.8 కిలోవాట్స్ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు.
Top speed
టాప్ స్పీడ్ పరంగా చూస్తే.. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1.. 90 కిలోమీటర్ పర్ అవర్ టాప్ స్పీడ్‌తో వెళ్తుంది.
ఎస్1 ప్రో 115 కేఎమ్‌పీహెచ్ టాప్ స్పీడ్‌తో వెళ్తుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రం టాప్‌స్పీడ్ రేంజ్ 98 కేఎంపీహెచ్ నుంచి 105 కేఎంపీహెచ్ వరకు ఉంటుంది.
ఎస్1 ప్రో.. 3 సెకండ్లలోనే 115 స్పీడ్‌ను అందుకుంటుంది.
Charging Time
ఓలాలో పోర్టబుల్ హోమ్ చార్జర్‌తో అయితే.. ఫుల్ చార్జ్ చేయడానికి ఎస్1 వెహికిల్‌కు 4.48 గంటలు, ఎస్1 ప్రో వెహికిల్‌కు 6.30 గంటలు పట్టనుంది.
ఇక.. సింపుల్ వన్ వెహికల్ పోర్టబుల్ 15ఏ చార్జింగ్ సాకెట్‌తో.. ఫుల్ చార్జింగ్ 2.5 గంటల్లో పూర్తవుతుంది.
Features
సింపుల్ వన్ స్కూటర్ 4జీ నెట్‌వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ప్యానెల్, బ్లూటూత్ కనెక్టివిటీ, జియో ఫెన్సింగ్, ఓవర్ ద ఎయిర్ అప్‌డేట్స్, ఆన్‌బోర్డ్ నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్ట్ చేసుకొని.. మ్యూజిక్ కంట్రోల్, కాల్ కంట్రోల్ చేసుకోవచ్చు.
టీపీఎమ్ఎస్ లాంటి ఫీచర్స్ ఇందులో ఉంటాయి.
ఇక.. ఓలా ఎస్1 డిజిటల్ కీ ఫీచర్‌తో వర్క్ చేస్తుంది. దానికి ఫిజికల్‌గా కీ అంటూ ఏమీ ఉండదు. మీ ఫోన్‌తో అనుసంధానం అయి.. మీరు స్కూటర్ దగ్గరికి వెళ్లగానే.. స్కూటల్ ఆటోమెటిక్‌గా అన్‌లాక్ అవుతుంది.
బైక్‌ను పార్క్ చేసి.. కొంత దూరం వెళ్లగానే.. బైక్ ఆటోమెటిక్‌గా లాక్ అవుతుంది.
దీంట్లో మల్టీ మైక్రోఫోన్ అర్రే, ఎల్ఈడీ లైట్స్, ఏఐ స్పీచ్ రికగ్నిషన్ ఆల్గారిథమ్స్ బిల్ట్ ఇన్ హౌస్, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, యాంటీ థెఫ్ట్ అలర్ట్ సిస్టమ్, జియో ఫెన్సింగ్, వాయిస్ రికగ్నిషన్ లాంటి ఫీచర్స్ ఉంటాయి.
Availability
సింపుల్ వన్ ప్రస్తుతం 13 రాష్ట్రాల్లో లాంచ్ అయింది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, గోవా, ఉత్తర ప్రదేశ్, గుజారత్, పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రమే లాంచ్ చేశారు.
ఇక.. ఓలా ఎస్1 సేల్స్.. సెప్టెంబర్ 8, 2021 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి దశలో భాగంగా.. దేశంలోని వెయ్యి నగరాల్లో అక్టోబర్ నెల వరకు డెలివరీలను అందజేస్తామని ఓలా వెల్లడించింది.