Homeతెలంగాణకొడుకు వదిలించుకున్నాడు.. వీళ్ళు చేరదీశారు...

కొడుకు వదిలించుకున్నాడు.. వీళ్ళు చేరదీశారు…

కన్న కొడుకులే వదిలేసిన ఓ వృద్దురాలిని కొందరు మంచి మనుషులు ఆదుకున్నారు. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని రోడ్డుపై వదలి వెళ్ళాడు గుర్తు తెలియని ఓ ప్రబుద్దుడు. ముసలితనం వచ్చిన తల్లిదండ్రులను నీచ పుత్రులు ఇలా వదిలించుకోవడం ఇదేమీ మొదటి సారి కాదు. ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. దమ్మాయిగూడా అయ్యప్ప కాలనీ బస్ షల్టర్​లో గత నెల రోజులుగా ఓ వృద్ధురాలు ఉంటోంది. తెలుగు రాదు, హిందీ మాట్లాడుతోంది… ఆకలితో ఉన్న వృద్దురాలికి స్థానికులు ఆహారాన్ని అందిస్తున్నారు. రోజు ఎవరైనా అన్నం ఇస్తే కొద్దిగా తిని మిగిలినది రాత్రికి ప్రక్కన పెట్టుకుంటుంది.. స్థానికులు ఆరా తీస్తే  తన కొడుకు ఇక్కడ వదిలేశా డాని చెప్పింది. రోజు ఎవరో ఒకరు ఎదో తినడానికి ఇస్తున్నారట. ఇలా దిక్కు మొక్కులేకుండా ఒంటరిగా జీవిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న దమ్మాయిగూడకు చెందిన వీఆర్​వో సోహెల్, అక్షర ఫౌండేషన్ రాజు కోట్ల, దాసరి నరసింహ రెడ్డి వృద్ధురాలికి సహాయం చేశారు. ప్రగతి నగర్​లోని మాధురి ఓల్డ్ ఏజ్ హోమ్​లో జాయిన్ చేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img