పారిస్ ఒలింపిక్స్‌కు రంగం సిద్ధమైంది. ఫ్రాన్స్ ఆతిథ్యమిస్తున్న ఈ క్రీడలు జులై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు జరుగుతాయి. పతకాల వేట కోసం భారత్ నుంచి 117 మంది బరిలోకి దిగుతున్నారు. ప్రపంచ వేదికపై భారత్ ఖ్యాతిని మరింత చాటేలా మన క్రీడాకారులు పట్టుదలతో సిద్ధమయ్యారు. అయితే వాళ్లలో తెలుగు క్రీడాకారులు 8 మంది ఉండటం విశేషం. వాళ్లంతా తప్పక పతకాలు సాధిస్తారని తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశమంతా ఆశతో ఉంది.