Homeతెలంగాణడ్రగ్స్‌కు బానిసైన ఒమేగా హాస్పిటల్ సీఈఓ.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు..!

డ్రగ్స్‌కు బానిసైన ఒమేగా హాస్పిటల్ సీఈఓ.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు..!

హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ వినియోగం రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకులు, సినిమా నటుల వరకు డ్రగ్స్ వాడకంలో పాల్గొంటున్నారని తాజా సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రముఖ ఒమేగా హాస్పిటల్ సీఈవో, మహిళా డాక్టర్ చిగురుపాటి నమ్రత డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు చిక్కడం సంచలనం రేపింది.

రాయదుర్గం పోలీసులు విశ్వసనీయ సమాచారం ఆధారంగా నమ్రత నివాసమైన షేక్‌పేట్‌లోని అపర్ణ వన్ అపార్ట్‌మెంట్‌లో దాడులు నిర్వహించారు. నమ్రత కొకైన్ వినియోగిస్తుండగా ఆమెను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కొన్నేళ్లుగా ఆమె డ్రగ్స్ తీసుకుంటూ.. మత్తు పదార్థాలకు బానిసగా మారి పోయారని తెలుస్తుంది. ఆమె ముంబైకి చెందిన వంశ్ టక్కర్ అనే డ్రగ్ స్మగ్లర్ నుంచి 53 గ్రాముల కొకైన్‌ను కొనుగోలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ లావాదేవీ కోసం నమ్రత రూ.5 లక్షలను ఆన్‌లైన్ ద్వారా వంశ్ టక్కర్‌కు చెల్లించినట్టు తెలుస్తుంది.ఈ సంఘటన హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యాప్తి తీవ్రతను మరోసారి బయటపెట్టింది. గతంలో కూడా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, పబ్‌లలో డ్రగ్స్ వినియోగం కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఒమేగా హాస్పిటల్ వంటి ప్రముఖ సంస్థ సీఈవో ఇలాంటి కేసులో చిక్కడం సమాజంలో ఆందోళన కలిగిస్తోంది. ఈ కేసు పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img