జానీ మాస్టర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తన అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 16న పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జానీ మాస్టర్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ 36 రోజులు జైల్లోనే ఉన్నాడు. ఇటీవలే జానీ మాస్టర్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అయన బయటికి వచ్చారు. అయితే బెయిల్ రద్దు చేయాలంటూ ఆ కేసులో బాధితురాలు దాఖలు చేసిన తాజా పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో జానీ మాస్టర్‌కు భారీ ఊరట లభించింది.