Homeహైదరాబాద్latest Newsకేటీఆర్ జన్మదిన సందర్భంగా గిఫ్ట్ స్మైల్ లో గ్రామస్తులకు షర్ట్స్ పంపిణీ

కేటీఆర్ జన్మదిన సందర్భంగా గిఫ్ట్ స్మైల్ లో గ్రామస్తులకు షర్ట్స్ పంపిణీ

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో కేటీఆర్ జన్మదినం సందర్భంగా రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్ గిఫ్ట్ స్మైల్ లో భాగంగా గ్రామస్తులకు షర్ట్స్ పంపిణీ చేసి అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి మాజీ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణలో యువతకు కంపెనీలు తీసుకువచ్చి ఉపాధి కల్పించి సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి గొప్ప నాయకుడు కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు రేపాక బాల్, నర్సు శంకర్ బాలయ్య, శ్రీనివాస్ రాజు అంజయ్య, బిఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img