ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈ రోజు “సంకష్టహర చతుర్థి” సందర్బంగా అనుబంధ దేవాలయము అయిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో గల గణపతికి గణపతి ఉపనిషత్లతో అభిషేకం, విశేష పూజలు, హారతి, మంత్రపుష్పం కార్యక్రమంలు అత్యంత వైభవంగా నిర్వహించబడినవి. ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్, సంపత్ కుమార్ స్థానిక వేదపండితులు మధు రామ శర్మ, జనుమంచి రాములు శర్మ, అర్చకులు విశ్వనాథ శర్మ, సాయికుమార్, అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు.