Homeహైదరాబాద్latest Newsవెన్నమనేని శ్రీనివాస్ రావు బర్త్ డే సందర్బంగా పాఠశాలకు లక్ష 50 వేల రూపాయల చెక్కు...

వెన్నమనేని శ్రీనివాస్ రావు బర్త్ డే సందర్బంగా పాఠశాలకు లక్ష 50 వేల రూపాయల చెక్కు అందజేత..!

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం, పోతుగల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోతుగల్ గ్రామానికి చెందిన వెన్నమనేని శ్రీనివాస్ రావు జన్మదిన సందర్భంగా వారి కూతురు హన్సిక పాఠశాలకు 10 కంప్యూటర్లకు లక్ష 50 వేల రూపాయల చెక్కును పోతుగల్ మాజీ సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు నాయకుల చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాధా కిషన్ కు అందించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గౌతమ్ రావు మాట్లాడుతూ.. వెన్నమనేని నర్సింగరావు కుమారుడు వెన్నమనేని శ్రీనివాసరావు పాఠశాలకు లక్షలు 50 వేల రూపాయల చెక్కును అందించడం గర్వించదగ్గ విషయం గతంలో గ్రామానికి అంబులెన్స్ అందించి, రామాలయం కు 30 లక్షలు, పెద్దమ్మ ఆలయం కు గంగమ్మ ఆలయం కు వివిధ రూపాలలో అనేక ఆర్థిక సహాయం అందించారని అడగగానే పాఠశాలకు కంప్యూటర్లకు వారి కూతురు హన్సిక చెక్కును అందించారని గ్రామంలో పాఠశాలకు అనేకమంది దాతల సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేసుకుంటున్నామని. పాఠశాల అధ్యాపక బృందం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యను అందిస్తున్నారని పదో తరగతిలో 100% ఉత్తీర్ణ సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకం అందిస్తున్నామని అన్నారు పాఠశాలకు వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అందిస్తున్న మాజీ సర్పంచ్ ని పాలకవర్గ సభ్యులను మాజీ ప్రజా ప్రతినిధులను శాలువలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో. మండల వైద్యాధికారి బత్తుల గీతాంజలి మాజీ సర్పంచ్ దావత్ పండరి మాజీ ఎంపీపీ అక్క రాజు శ్రీనివాస్. ఎంపిటిసి బాలకిషన్. వార్డు సభ్యులు నాంపల్లి మంజుల రమేష్. కావేటి మహిపాల్ జంగా రాజు. మాధవరావు. రేపాక బాల నర్సు. అక్కరాజు పరుశరాములు. ప్రధానోపాధ్యాయులు. రాధా కిషన్ ఉపాధ్యాయులు మామిండ్ల భూపతి. ఉపాధ్యాయ బృందం గ్రామ యువకులు తోట ధర్మేందర్. కోళ్ల కృష్ణ. అమ్మ ఆదర్శ పాఠశాల ఎస్ఎంసి చైర్మన్లు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img