Homeజాతీయంఆకాశం హద్దు కాదు.. ఇది ఆరంభం మాత్రమే

ఆకాశం హద్దు కాదు.. ఇది ఆరంభం మాత్రమే

– చంద్రయాన్​–3 సక్సెస్​పై
రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్ వ్యాఖ్యలు

– అంతరిక్షపరిశోధనలపై పెద్దల సభలో చర్చ

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: రాజ్యసభలో చంద్రయాన్​–3 సక్సెస్​పై ఎంపీలు చర్చించారు. ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ మాట్లాడుతూ.. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశం భార‌త్ అని అన్నారు. చంద్రుడి ద‌క్షిణ ద్రువంపై ల్యాండ‌ర్‌ను దింపిన తొలి దేశం మ‌న‌దే అని తెలిపారు. చంద్ర‌యాన్‌, మంగ‌ళ‌యాన్‌, ఆదిత్య ఎల్‌–1 మిషన్ల స‌క్సెస్‌ను ఆయ‌న ప్ర‌స్తావిస్తూ.. ఆకాశం హ‌ద్దు కాదు అని, ఇది ఆరంభం మాత్ర‌మే అని ప్ర‌పంచానికి భార‌త్ చాటింద‌న్నారు.

స్వ‌దేశీ శాటిలైట్ల‌నే కాకుండా, విదేశీ ఉప‌గ్ర‌హాల‌ను కూడా ఇండియా లాంచ్ చేస్తోంద‌ని చైర్మెన్ జ‌గ‌దీప్ తెలిపారు. జ‌నవరి 2018 నుంచి న‌వంబ‌ర్ 2022 వ‌ర‌కు 177 విదేశీ శాటిలైట్లను ఇస్రో ప్ర‌యోగించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ 424 విదేశీ శాటిలైట్ల‌ను లాంచ్ చేసింద‌ని, దాంట్లో గ‌త 9 ఏళ్ల‌లోనే 90 శాతం శాటిలైట్ల‌ను ప్ర‌యోగించినట్లు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. చంద్ర‌యాన్‌-3 స‌క్సెస్‌తో సైంటిస్టులు, సైన్స్ మేధావులు సంబ‌రాలు చేసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. భార‌తీయ సైంటిస్టుల్లో టాలెంట్‌, సామ‌ర్థ్యం అధికంగా ఉన్న‌ట్లు చెప్పారు.

గ‌డిచిన 9 ఏళ్ల‌లో అంత‌రిక్ష శాఖ‌కు బ‌డ్జెట్ 142 శాతం పెరిగిన‌ట్లు తెలిపారు. 2013-14 సంవ‌త్స‌రంలో ఆ శాఖ‌కు కేవ‌లం 5,158 కోట్లు మాత్ర‌మే కేటాయించార‌ని, కాని ఇప్పుడు 13 వేల కోట్ల‌కు చేరిందని జగదీప్ ధనకర్ పేర్కొన్నారు. నేష‌న‌ల్ రీస‌ర్చ్ ఫౌండేష‌న్ ఏర్పాటు వ‌ల్ల చాలా లాభాలు జ‌రిగిన‌ట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ప్ర‌భుత్వేత‌ర వ‌ర్గాల నుంచే ఆ సంస్థ‌కు సుమారు 36 వేల కోట్ల నిధులు వ‌చ్చిన‌ట్లు తెలిపారు.

భార‌తీయ అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల్లో జ‌త కూడేందుకు అనేక దేశాలు త‌మ ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ తెలిపారు. ఇస్రో సైంటిస్టులకు స‌రైన స‌మ‌యంలోనే జీతాలు అందుతున్న‌ట్లు కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజుజు తెలిపారు. ఇస్రో శాస్త్ర‌వేత్త‌లకు జీతాలు రావ‌డం లేద‌ని కాంగ్రెస్, టీఎంసీ ప్ర‌చారం చేస్తున్నాయ‌ని, అస‌లు మీరు అలా ఎలా ఆలోచిస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌మ‌కు పెన్ష‌న్ కూడా అందుతున్న‌ట్లు ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు చెప్పార‌ని మంత్రి వెల్ల‌డించారు. పార్ల‌మెంట్‌ను అబ్ధాల‌తో త‌ప్పుదోవ ప‌ట్టించ‌డం స‌రికాద‌న్నారు.

Recent

- Advertisment -spot_img