Homeహైదరాబాద్latest Newsఒకప్పటి బాల నటుడు.. ఇప్పుడు వెండితెరపై క్రేజీ హీరో … ఎవరో తెలుసా..?

ఒకప్పటి బాల నటుడు.. ఇప్పుడు వెండితెరపై క్రేజీ హీరో … ఎవరో తెలుసా..?

గతంలో బాల నటుడిగా నటించి కొన్ని సినిమాలతో మంచి ఫాలోయింగ్ తెచుకున్నాడు అయితే ఒకప్పుడు సినిమాల్లో నటించిన ఆ బాల నటుడు ఇప్పుడు వెండితెరపై హీరోగా అలరిస్తున్నాడు. బాల నటుడిగా ప్రసిద్ధి చెందిన మహేంద్రన్ 100కి పైగా తమిళ మరియు తెలుగు భాషా చిత్రాలలో నటించాడు. అతను 3 సంవత్సరాల వయస్సులో నటించడం ప్రారంభించాడు. ఇది భారతదేశంలోనే ఒక అరుదైన రికార్డ్. అతను రెండు నంది అవార్డులు మరియు రెండు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను అందుకున్నాడు.
మహేంద్రన్ నటించిన ‘నట్టమై’ అనే తమిళ సినిమాతో తన అరంగేట్రం చేసాడు. ‘తైకులమే తైకులమే’ మరియు ‘కుంభకోణం గోపాలు’ చిత్రాలకు అతను రెండుసార్లు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును ఉత్తమ బాలనటుడిగా గెలుచుకున్నాడు.అతను తెలుగులో ‘దేవి’ సినిమా మరియు ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలకి కోసం ఉత్తమ బాలనటుడిగా రెండుసార్లు నంది అవార్డును కూడా గెలుచుకున్నాడు.
అయితే ఇప్పుడు పెద్దయ్యాక… తమిళంలో హీరోగా చాలా సినిమాలు చేశాడు. ఇతర హీరోల సినిమాల్లోనూ ప్రముఖ పాత్రలు పోషిస్తున్నాడు. దళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాలో యంగ్ భవాని పాత్రలో మహేంద్ర కనిపించాడు. ప్రస్తుతం మహేంద్రన్ హీరోగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. తెలుగులో బాలనటుడిగా అలరించిన మహేంద్రన్ ఇంకా టాలీవుడ్ లో ఇంకా హీరోగా సినిమాలు చేయలేదు. ప్రస్తుతం ఈ కుర్రాడు తమిళంలోనే హీరోగా నటిస్తున్నాడు.

Recent

- Advertisment -spot_img