Homeహైదరాబాద్latest Newsమరో సారి వర్ష గండం.. ఈ జిల్లాలో వర్షాలే వర్షాలు..!

మరో సారి వర్ష గండం.. ఈ జిల్లాలో వర్షాలే వర్షాలు..!

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. కోస్తా వెంబడి కొన్ని చోట్ల, సీమ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణం ఉంటుంది. ఇవాళ నెల్లూరు, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు నెల్లూరు,అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే నవంబర్ 12, 13 తేదీల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Recent

- Advertisment -spot_img