ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప 2’ డిసెంబర్ 05న ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో 12 వేల థియేటర్లలో విడుదలవుతోంది. కర్ణాటకలో 400కి పైగా థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా బెంగళూరులోని మెజెస్టిక్ ప్రాంతంలోని మూడు థియేటర్లలో విడుదలవుతోంది. ‘పుష్ప 2’ మెజెస్టిక్‌లోని అనుపమ, త్రివేణి మరియు సంతోష్ థియేటర్లలో విడుదలవుతోంది. 100 మీటర్ల దూరంలో మూడు థియేటర్లు ఉండగా, ఈ మూడు థియేటర్లలో ‘పుష్ప 2’ సినిమా వివిధ భాషల్లో విడుదలవుతోంది. దీంతో పాటు భూమిక థియేటర్లలో కూడా సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మెజెస్టిక్ ఏరియాలో ఒకే సినిమా రెండు థియేటర్లలో విడుదల కావడం కొత్తేమీ కాదు. దీనికి ముందు డా. రాజ్ కుమార్ నటించిన సినిమాలు రెండు, రెండు థియేటర్లలో విడుదలైన దాఖలాలు ఉన్నాయి. అయితే బెంగళూరులో ఒకే రోడ్డులో మూడు ప్రధాన థియేటర్లలో తెలుగు సినిమా విడుదల కావడం ఇదే తొలిసారి. అయితే ఒకప్పుడు కన్నడ స్టార్ హీరో రాజ్‌కుమార్ రికార్డు ని బద్దలుకొట్టడం మరే కన్నడ హీరో సాధ్యంకాలేదు. కానీ ఆ రికార్డు ని అల్లుఅర్జున్ ‘పుష్ప 2’ సినిమాతో ఆ ఘనత సాధించాడు.