ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..’అన్ని పథకాలకూ ఒకే కార్డు.. అదే వన్ ఫ్యామిలీ డిజిటల్ కార్డు. అర్హులైన వారికి పథకాలు అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టాం. ఒక్క క్లిక్ తో లబ్దిదారుల సమాచారం తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక కార్డు ఇస్తాం. రేషన్ కార్డులు ఇవ్వలేదని ప్రజలు కేసీఆర్ ను ఇంటికి పంపించారు’ అని అన్నారు.