విశాఖ ఆర్కే బీచ్ దగ్గర భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. పాండురంగాపురం వైపు ఎలక్షన్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. పోలీసులను గమనించిన నిందితులు కారును అక్కడే వదిలిపెట్టి పారిపోయారు. కారులో ఉన్న రూ. 1.54 కోట్లను అధికారులు సీజ్ చేశారు.