టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి రెండో పతకం దక్కనుంది. బాక్సర్ లవ్లీనా ఈరోజు సెమీ ఫైనల్‌కి చేరడం ద్వారా భారత్‌కి పతకాన్ని ఖాయం చేసింది.
ఇప్పటికే మీరాబాయి చాను రజతం గెలిచిన విషయం తెలిసిందే.
టోక్యో ఒలింపిక్స్‌లోకి భారత్‌కి మరో పతకం దక్కనుంది.
మహిళల 69 కేజీల బాక్సింగ్ విభాగంలో పోటీపడిన లవ్లీనా శుక్రవారం క్వార్టర్స్‌లో చైనీస్ తైపీ చిన్ చెన్‌ని ఓడించి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
దాంతో.. భారత్‌కి పతకం ఖాయమైంది. ఇప్పటికే వెయిట్‌లిప్టింగ్‌లో మీరాబాయి చాను భారత్‌కి రజత పతకం అందించిన విషయం తెలిసిందే.
క్వార్టర్స్‌లో చిన్ చెన్‌పై 4-1 తేడాతో లవ్లీనా విజయం సాధించింది.
అస్సాంకి చెందిన 23 ఏళ్ల లవ్లీనా.. ఫస్ట్ రౌండ్‌లో పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించి 3-2తో గెలిచింది.
అనంతరం సెకండ్ రౌండ్‌లోనూ అదే దూకుడు కొనసాగించిన లవ్లీనా.. డిఫెన్స్‌లోనూ అత్యుత్తమంగా రాణించింది.
దాంతో.. రెండో రౌండ్ కూడా 3-2తో లవ్లీనా సొంతమైంది.
ఇక ఆఖరి రౌండ్‌లో చిన్ చెన్ పూర్తిగా ఒత్తిడిలోకి వెళ్లిపోగా.. వరుస పంచ్‌లు గుప్పించి లవ్లీనా.. ఆఖరిగా 4-1తో సెమీస్‌లోకి అడుగుపెట్టింది.