Homeఆంద్రప్రదేశ్​తెలంగాణలో ఏపీ ప్రజలకు రేషన్​

తెలంగాణలో ఏపీ ప్రజలకు రేషన్​

వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌ కార్డ్‌ పోర్టబిలిటీ ద్వారా ఏపీ రాష్ట్రానికి చెందిన పలువురు తెలంగాణలో ఉచితంగా సరుకులు అందుకున్నారు. అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వంద మందికి పైగా తెలంగాణలోని వివిధ రేషన్‌ షాపుల్లో మంగళవారం ఈ-పాస్‌ మిషన్‌లో వేలి ముద్రలు వేసి బియ్యంతో పాటు కందిపప్పు తీసుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో పోర్టబిలిటీ త్వరలో అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో తొమ్మిదవ విడత ఉచిత సరుకుల పంపిణీలో భాగంగా మంగళవారానికి దాదాపు 1.12 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందాయి. రాష్ట్ర పరిధిలో పోర్టబిలిటీ ద్వారా వివిధ జిల్లాల్లో 32.56 లక్షల కుటుంబాలు సరుకులు తీసుకున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img