Homeహైదరాబాద్latest Newsపండగపూట జహీరాబాద్ లో విషాదం..

పండగపూట జహీరాబాద్ లో విషాదం..

–అన్నచెల్లెలు పతంగి ఎగురవేస్తుండగా కరెంటు షాక్

–అన్న శివకుమార్ మృతి

–గ్రామంలో విషాదఛాయలు

సంక్రాంతి పండగపూట అన్నచెల్లెలు సంతోషంగా పతంగులు ఎగురవేస్తూ సంబురపడుతుంటే… విధి వాళ్ల సంతోషాన్ని ఓర్వలేదేమో ఆ రక్కాసి కరెంట్ తీగతుల రూపంలో ఓ నిండు ప్రాణాన్ని బలితీకుంది. వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం పొట్టిపల్లి గ్రామానికి చెందిన శివకుమార్ (21) ఉదయం పూట తన చెల్లెలుతో కలిసి ఇంటిపక్కన పతంగి ఎగరవేస్తుండగా కరెంటు షాక్ తగిలి తలకు తీవ్ర గాయమైంది. స్పృహ తప్పి కిందపడిపోయాడు. దీనితో ఆ యువకున్ని హుటాహుటిన జహీరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు.

దీంతో గ్రామంలో సోమవారం నాడు విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉదయం వరకు తమతో సరదాగా కలిసి ఉన్న మిత్రుడు కరెంటు షాక్ తో మరణించడంతో స్నేహితులు బోరున విలపించారు. పలువురు శివకుమార్ మృతదేహనికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Recent

- Advertisment -spot_img