ఇదే నిజం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం మల్లారం శివారులో చోటుచేసుకుంది. దూస్గాం గ్రామానికి చెందిన మురళి తన భార్యతో కలిసి వర్ని వైపు నుంచి బాన్సువాడ వెళ్తుండగా వర్ని మండలం మల్లారం శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో మురళి అక్కడికక్కడే మృతి చెందగా అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను స్థానికులు బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు వర్ని ఎస్సై కృష్ణకుమార్ తెలిపారు.