Homeహైదరాబాద్latest Newsప్రేమించాలని ఒకడు, పెళ్లి చేసుకోవాలని మరొకడు.. యువకుల వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య

ప్రేమించాలని ఒకడు, పెళ్లి చేసుకోవాలని మరొకడు.. యువకుల వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య

ప్రేమించాలని ఒకరు, పెళ్లి చేసుకోవాలని మరొకరు చేస్తున్న వేధింపులు భరించలేక కొత్త కళ్యాణి(18) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్గొండ జిల్లా, మాడుగులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలో చోటుచేసుకుంది. మాడుగులపల్లి ఎస్సై జి శోభన్ బాబు తెలిపిన వివరాల ప్రకారం… కుక్కడం గ్రామానికి చెందిన నిందితులు ఏ-1 అర్రూరి, శ్రీను, ఏ-2 కొమ్మనబోయిన మధు, యువకులు గత కొంతకాలంగా వాట్సాప్ ఇంస్టాగ్రామ్ లలో యువతి ఫోటోలు స్టేటస్ పెట్టుకుంటామని నిందితులు ఆమెను వేధింపులకు కృషి చేశారు. దీంతో మనస్థాపానికి గురై యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం గడ్డి మందు తాగగా చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువతి మంగళవారం సాయంత్రం సమయంలో మృతి చెందింది. ఆమె తల్లి కొత్త రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మాడుగులపల్లి ఎస్సై జి శోభన్ బాబు తెలిపారు.

Recent

- Advertisment -spot_img