Homeజాతీయంఒకే దేశం ఒకే విద్యావిధానం - ప్రధాని

ఒకే దేశం ఒకే విద్యావిధానం – ప్రధాని

దేశం మొత్తానికి విద్యావ్యవస్థా విధానం ఒకేలా ఉండాలని దేశ ప్రధాని మోడీ అన్నారు. జాతీయ విద్యావిధానంపై ప్రధాని మోడీ ప్రసంగించారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మోడీ ప్రసంగం చేశారు. కొత్త విద్యావిధానంతో విస్తృత ప్రయోజనాలు ఉన్నాయన్నారు. విస్తృత అధ్యయనం తర్వాతే ఈ నూతన విద్యావిధానం తీసుకువచ్చామని, విద్యావిధానంపై ఆరోగ్యకరమైన చర్చ జరగాలన్నారు. దేశంలో 30 ఏళ్ళ తరువాత ప్రభుత్వం కొత్త జాతీయ విద్యా విధానం తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ కొత్త విద్యావిధానంపై ఎవ్వరూ ఆందోళన, అపోహలు వద్దన్నారు ప్రధాని. భవిష్యత్​ లక్ష్యాలకు విద్యార్థులను సిద్దం చేయడమే నూతన విద్యావిధానం ప్రధాన లక్ష్యమన్నారు. యువతలో విద్యానైపుణ్యలు పెంపొందిచాల్సిన అవసరం ఉందని, ఈ నూతన విధానంతో విద్యార్థుల్లో మరింత నైపుణ్యాలను పెంపొందించే ఆస్కారముందని తెలిపారు. కొత్త ఆవిష్కరణల దిశగా విద్యార్థుల నైపుణ్యాలను, ఆలోచనలను పెంపొందించేలా ఈ విధానం ఉండబోతుందని సూచించారు ప్రధాని.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img