అన్నమయ్య జిల్లాలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మదనపల్లెలో చోటుచేసుకుంది. తంబళ్లపల్లె దిగువగాలిగుట్టకు చెందిన పద్మనాభరెడ్డి (27) ఇటీవల ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు వేసి రూ.24 లక్షలు పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన అతడు మదనపల్లెలో తన అమ్మమ్మ ఇంటికి వచ్చేందుకు ఈనెల 11న రాత్రి బెంగళూరు నుంచి బయలుదేరగా.. రెడ్డివారిపల్లె వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.