Homeహైదరాబాద్latest News199 సినిమాల్లో కేవలం 26 హిట్..! వందల కోట్లు నష్టం.. మలయాళం ఇండస్ట్రీ కోలుకుంటుందా..?

199 సినిమాల్లో కేవలం 26 హిట్..! వందల కోట్లు నష్టం.. మలయాళం ఇండస్ట్రీ కోలుకుంటుందా..?

భారతీయ సినిమా ప్రపంచంలో మంచి కథాబలమున్న సినిమాల విషయంలో అందరూ మలయాళ సినిమా వైపే మొగ్గు చూపుతారు. అయితే 2024 ఏడాది మాత్రం మలయాళం ఇండస్ట్రీకి నిరాశనే మిగిల్చింది. 2024 సంవత్సరంలో 199 మలయాళ సినిమాల్లో కేవలం 26 సినిమాలు మాత్రమే అభిమానుల ఆదరణ పొంది కలెక్షన్లు రాబట్టాయి. మిగతా సినిమాల్లో అన్నీ పరాజయాలే. ఈ సినిమాల నిర్మాణ వ్యయం 1000 కోట్లు అని చెప్పగా.. వాటి ద్వారా వచ్చిన లాభం కేవలం 350 కోట్లు అని అంటున్నారు. 2024లో మలయాళ సినిమాకు 700 కోట్ల నష్టం వాటిల్లుతుందని కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రకటించింది. మరి వచ్చే ఏడాది అయినా మలయాళం ఇండస్ట్రీ తిరిగి కోలుకొని మంచి హిట్లు కొడుతుందో ఏమో చూడాలి.

Recent

- Advertisment -spot_img