Ration Card e-KYC: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. రేషన్ కార్డు eKYC ప్రక్రియను వెంటనే పూర్తి చేయండి. రేషన్ కార్డు e-KYC పూర్తి చేయడానికి మరో 5 రోజులే గడువు మాత్రమే ఉంది. ఈ గడువు లోపు ఇ-కెవైసి పూర్తి చేయని వారు రేషన్ సౌకర్యాలు, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి, వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయడం మంచిది.. ఈ క్రింది స్టెప్ ఫాలో అయి మీ రేషన్ కార్డు ఇ-కెవైసి వివరాలు తెలుసుకోండి..


రేషన్ కార్డు ఇ-కెవైసి పూర్తి చేయండిలా..!
ఆన్‌లైన్ ప్రక్రియ:
- తెలంగాణ ఈపీడీఎస్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: epds.telangana.gov.in.
- హోమ్‌పేజీలో “లాగిన్” బటన్‌పై క్లిక్ చేయండి.
- మీ యూజర్‌నేమ్ మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేసి లాగిన్ చేయండి.
- “ఇ-కెవైసి” ఎంపికను ఎంచుకోండి.
- మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయండి.
- ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి.
- వివరాలను సమర్పించి, ఇ-కెవైసి ప్రక్రియను పూర్తి చేయండి.
ఆఫ్‌లైన్ ప్రక్రియ:
- మీ సమీప రేషన్ షాప్ లేదా మీసేవా కేంద్రాన్ని సందర్శించండి.
- మీ ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు వివరాలను సమర్పించండి.
- బయోమెట్రిక్ వెరిఫికేషన్ (వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్) పూర్తి చేయండి.
అవసరమైన డాక్యుమెంట్లు:
- ఆధార్ కార్డు (బయోమెట్రిక్ వెరిఫికేషన్ కోసం).
- రేషన్ కార్డు నంబర్.
- ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్ (OTP కోసం).