Homeహైదరాబాద్latest Newsబీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ కోసం పోరాడగలదు.. మళ్లీ మాదే అధికారం.. కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ కోసం పోరాడగలదు.. మళ్లీ మాదే అధికారం.. కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బుధవారం పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ‘రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేయాలి. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ కోసం పోరాడగలదు. ప్రజల కష్టాలు బీఆర్ఎస్ కు మాత్రమే తెలుసు. వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తాం’ అని వ్యాఖ్యానించారు. అలాగే బీఆర్ఎస్ ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు వ్యూహ రచనపై చర్చించినట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img