తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వంపై, సీఎం రేవంత్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా కాసేపటి క్రితం సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా గతంలో కేటీఆర్ ముఖ్య అనుచరుడిగా, BRS ఐటీ వింగ్ లో కీలక బాధ్యతలు పోషించిన దిలీప్.. కాంగ్రెస్ సర్కారు ఏర్పాడ్డాక ప్రభుత్వంపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని పలు కేసులు నమోదయ్యాయి.