హర్యానా ఫలితాలలో ఆప్ ఖాతా తెరవలేని పరిస్థితి నెలకొంది. మొదట కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని భావించినా.. సీట్ల సర్ధుబాటు కుదరకపోవడంతో ఆప్ ఒంటరిగా పోటీ చేసింది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ఆ రాష్ట్రానికి సమీపంలో ఉండే హర్యానాలో బోణి కొడుతుందని ఆపార్టీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేసినా.. హర్యానా ఓటర్లు మాత్రం ఆప్ వైపు మొగ్గుచూపనట్లు ఫలితాల సరళిని చూస్తే తెలుస్తోంది.