Homeహైదరాబాద్latest Newsసీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరవండి

సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరవండి

– సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అతిమేల మాణిక్

ఇదేనిజం, నారాయణఖేడ్: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీసీఐ కొనుగోలు కేంద్రాలను తెరవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అతిమేల మాణిక్ డిమాండ్​ చేశారు. సోమవారం నారాయణఖేడ్ లోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నారాయణఖేడ్​ సెగ్మెంట్ లో పెద్ద ఎత్తున పత్తి పంట సాగు అవుతోందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 3,55,802 ఎకరాల్లో సుమారు 3,55,802 మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు నరసింహులు, కాన్సిరాం, సంతోష్, మోషప్ప, అరుణ్, రమేశ్​ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img