Homeహైదరాబాద్latest Newsఖుషీ అయిన ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్

ఖుషీ అయిన ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్

Idenijam, Webdesk : SRH ప్లేయర్లు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 2 లోని పార్క్ హయత్ హోటల్‌లో బస చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అటుగా వెళ్తున్న కొందరు ఫ్యాన్స్‌ను ఆరెంజ్ ఆర్మీ హోర్డింగ్ ఆకర్శించింది. హోటల్ ఎంట్రీ దగ్గర ఉన్న ఫ్లెక్సీని చూసి షాక్ అయ్యారు. స్టార్ బ్యాట్స్‌మన్ ట్రేవిస్ హెడ్‌ను చూసినట్లు వారు చెప్పారు. ఆ ఫోటోలను తమ కెమెరాల్లో బంధించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పరిసర ప్రాంతాల్లో పోలీసులు వాళ్లని అక్కడినుంచి పంపించివేశారు. ఫ్యాన్స్ ఎవరూ హోటల్ పరిసరాల వద్దకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ నెక్స్ట్ మ్యాచ్‌ ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్‌తో హైదరాబాద్‌లో ఆడనుంది.

Recent

- Advertisment -spot_img