Homeహైదరాబాద్latest Newsగోషామహల్‌లో ఉస్మానియా ఆస్పత్రి.. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్‌రెడ్డి

గోషామహల్‌లో ఉస్మానియా ఆస్పత్రి.. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్‌రెడ్డి

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లోని గోషామహల్‌లో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనాన్ని నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వేగవంతం చేయాలన్నారు. గోషా‌మహల్‌లోని పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు దాదాపు 32 ఎకరాల స్థలం ఉందని, ప్రస్తుతం పోలీస్ విభాగం అధ్వర్యంలో ఉన్న ఈ స్థలాన్ని వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని, అక్కడే ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ సచివాలయంలో పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ స్పీడ్ జాబితాలో ఉన్న 19 పనుల్లో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణం, 15 కొత్త నర్సింగ్ కాలేజీలు, 28 కొత్త పారామెడికల్ కాలేజీలు, జిల్లాల్లో సమాఖ్య భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలపై సీఎం రేవంత్ చర్చించారు.

Recent

- Advertisment -spot_img