HomeసినిమాOTT మెటీ నెట్‌ఫ్లిక్స్

OTT మెటీ నెట్‌ఫ్లిక్స్

ఇంటర్నెట్ యుగంలో కాసుల పంట పండిస్తున్న వ్యాపారాల్లో ఓటిటి ఒకటి. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ గా ఏర్పడి, ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూనే, కళ్లు చెదిరే బిజినెస్​తో మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరితో ఇన్ డైరెక్ట్ గా ఓటీటీలు బిజినెస్​ చేస్తున్నాయి. ఇలాంటి ప్లాట్ ఫామ్స్ లో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఒకటి. ఇది అమెరికాకు చెందిన ఓటిటి. 45 భాషలకు సంబంధించిన కంటెంట్ ను నెట్ ఫ్లిక్స్ అందిస్తోంది. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న నెట్ ఫ్లిక్స్, ఇండియాలో భారీ స్థాయిలో సబ్​ స్క్రిప్షన్​ను సంపాదించుకుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు, కామెడీ షోలు, డాక్యుమెంటరీలు, ఇంటర్వ్యూలు.. ఇలా ఎంటెర్టైమెంట్ కి సంబంధించిన ప్రతీ విషయాన్ని, తమ ప్లాట్ ఫామ్ లో ఈ సంస్థలు ప్రజెంట్ చేస్తున్నాయి.

ఇక 2007 లో మొదలైన నెట్ ఫ్లిక్స్ డిజిటల్ కంపెనీ, వరల్డ్ వైడ్ గా ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు ఈ కంపెనీ, భారత్ నుంచి రెండు వేల రెండు వందల కోట్లకు పైగా సంపాదిస్తుందని రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా తెలుస్తోంది. గత వార్షిక సంవత్సరంతో పోలిస్తే 75 శాతం బిజినెస్ పెరిగిందని, సంస్థ ప్రకటించింది. మొదట్లో డీవీడీ క్యాసెట్లు అమ్ముకునే కంపెనీగా మొదలైన నెట్ ఫ్లిక్స్ ఇప్పుదు డిజిటల్ వరల్డ్ ను శాసించే స్థాయికి చేరుకుంది. నెట్‌ఫ్లిక్స్ సాఫ్ట్‌వేర్, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, డిజిటల్ మీడియా ప్లేయర్‌లు, వీడియో గేమ్ కన్సోల్‌లు, స్మార్ట్ టీవీలు.. ఇలా ఇంటర్నెట్ సదుపాయంతో ఉన్న ఏ డివైస్ లోనైనా వీక్షించవచ్చు.

Recent

- Advertisment -spot_img