HomeసినిమాOTT News : ఈ నెల 28న OTT లోకి చిన్నా..

OTT News : ఈ నెల 28న OTT లోకి చిన్నా..

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ హీరోగా నటించిన రీసెంట్ మూవీ ‘చిన్నా’. ఎమోషనల్ అండ్ థ్రిల్లర్ సబ్జెక్ట్​గా ఎస్ యూ అరుణ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు. తమిళ్​లో ‘చిత్తా’పేరుతో రిలీజ్ కాగా.. సిద్ధార్థ్ నిర్మాతగా వ్యవహరించాడు. తమిళ్​తో పాటు తెలుగులోనూ ఈ మూవీ మంచి సక్సెస్​ను అందుకుంది. ఇక, ఫైనల్​గా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్​కు అఫీషియల్ డేట్​ను లాక్ చేసుకుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 28 నుంచి పాన్ ఇండియా భాషల్లో హాట్​ స్టార్​లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్సయిన వారు ఓటీటీలో చూడొచ్చు.

Recent

- Advertisment -spot_img