Homeహైదరాబాద్latest NewsOTT News : 12న ఓటీటీలోకి ప్రేమలు?

OTT News : 12న ఓటీటీలోకి ప్రేమలు?

చిన్న సినిమాగా రిలీజై మలయాళంలో సెన్షేషన్ క్రియేట్ చేసిన మూవీ ప్రేమలు. వరల్డ్ వైడ్​గా ఈ సినిమా రూ.135 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. నస్లెన్ కె గఫూర్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో గిరీష్ ఏడీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్​టైనర్​ తెలుగులోనూ డబ్ అయి సక్సెస్ సాధించింది. అయితే, ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్​కు రెడీ అయినట్లు సమాచారం. ఈ నెల 12న డిస్నీ హాట్​స్టార్​లో ప్రేమలు మూవీ మలయాళం, తెలుగు, తమిళ వెర్షన్లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే, తెలుగు వెర్షన్ మాత్రం ఆహా వీడియోలో కూడా అందుబాటులో ఉండనుంది. ఈ విషయంపై ఇంకా అఫిషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ప్రేమలు తెలుగు వెర్షన్​ను ఎస్ఎస్ రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ డిస్ట్రిబ్యూట్ చేసిన విషయం తెలిసిందే. ప్రేమలు సినిమాలో శ్యామ్ మోహన్ ఎమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిలా భార్గవన్, అల్తాఫ్ సలీం, మాథ్యూ థామస్, సంగీత్ ప్రతాప్ కీలక పాత్రల్లో నటించగా.. విష్ణు విజయ్ సంగీతం అందించారు.

Recent

- Advertisment -spot_img