Homeహైదరాబాద్latest NewsOTT News : ప్రేమలు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

OTT News : ప్రేమలు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

గిరీష్ ఏడీ దర్శకత్వంలో నస్లెన్ కే. గఫూర్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్​టైనర్ ప్రేమలు. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడి బాక్సాఫీసు వద్ద సెన్షేషన్ క్రియేట్ చేసింది. మంచి వసూళ్లను సాధించిన ఈ సినిమాను ఇటీవల తెలుగులోనూ అదే పేరుతో డబ్ అయిన సంగతి తెలిసిందే. రాజమౌళి కుమారుడు కార్తికేయ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేయగా.. ఇక్కడ మంచి సక్సెస్​ను అందుకుని భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళం సినిమాగా ప్రేమలు నిలిచింది. అయితే, ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 29 నుంచి మలయాళంతో పాటుగా, తెలుగు మరియు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. శ్యామ్ మోహన్ ఎమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిలా భార్గవన్, అల్తాఫ్ సలీం, మాథ్యూ థామస్, సంగీత్ ప్రతాప్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విష్ణు విజయ్ సంగీతం అందించారు.

Recent

- Advertisment -spot_img