Homeహైదరాబాద్latest NewsOTT News : ఓటీటీలోకి ఓపెన్ హైమర్ తెలుగు వెర్షన్

OTT News : ఓటీటీలోకి ఓపెన్ హైమర్ తెలుగు వెర్షన్

అణుబాంబు సృష్టికర్త జీవిత కథ ఆధారంగా కిలియన్ మర్ఫీ హీరోగా హాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ‘ఓపెన్ హైమర్’ (Oppenheimer) గతేడాది రిలీజై భారీ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆస్కార్ (Oscar) అవార్డుల్లోనూ ఈ సినిమా సత్తా చాటింది. ఉత్తమ చిత్రం, దర్శకుడు సహా ఆరు అవార్డులకు దక్కించుకుంది. అయితే, కొన్నిరోజుల కిందటే ఈ సినిమా ఇండియాలో ఓటీటీ స్ట్రీమింగ్​కు వచ్చేసింది. ఇంగ్లీష్​, హిందీ వెర్షన్లలో మొదట అందుబాటులోకి వచ్చింది. అయితే, నోలన్ బ్రాండ్​కు ఉన్న పేరుతో తెలుగులో కూడా ఈ సినిమా కోసం ఎదురు చూసినవారు లేకపోలేదు. తెలుగుతో పాటు ఇతర రీజినల్ లాంగ్వేజెస్​లో సినిమా చూసేవారి కోసం అన్ని ప్రముఖ భాషల్లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేంది. జియో సినిమా యాప్​లో ‘ఓపెన్ హైమర్’ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. అయితే, తెలుగులో ఈ సినిమా చూడాలనుకునేవారు జియో సబ్​స్క్రిప్షన్ ఉంటేనే చూడొచ్చు.

Recent

- Advertisment -spot_img