Homeహైదరాబాద్విదేశాలకు మన గణేశుడు

విదేశాలకు మన గణేశుడు

హైదరాబాద్​, ఇదేనిజం – వినాయక చవితిని పురస్కరించుకుని భాగ్యనగరం నుంచి అంతర్జాతీయ విమానశ్రయం ద్వారా యూకే(లండన్​)కు ఏయిర్​కార్గో ద్వారా విగ్రహాలను తరిస్తున్నారని ఏయిర్​పోర్టు వర్గాలు వెల్లడించారు.. ఈసందర్భంగా ఏయిర్​ పోర్ట్​ జీహెచ్​ఏసీ అధికారులు మాట్లడుతూ… లండన్​లోని మనభారతీయలు ఇతర భక్తుల కోసం ఎకో ఫ్రెండ్లీ, పర్యావరణ హిత గణేష్​ ప్రతిమలను హైదరాబాద్​నుంచి విమానంలో అక్కడికి తరలించడం జరుగుతుందన్నారు. నగరం నుంచి వినాయక ప్రతిమలను లండన్​కు పంపించడం(ఎగుమతి)చేయడం ఇదే మొదటిసారని ఈ విగ్రహాల ఎత్తు 6 ఆంగుళాలు నుంచి 2 అడుగుల ఎత్తువరకు వివిధ పరిమాణాల్లో ఉంటాయని వారు వెల్లడించారు. ఎయిల్​ ట్రావేల్​ బబుల్​ లో భాగంగా ఇటీవలే ప్రారంభమైన బ్రిటిష్​ ఎయిర్​వేస్​ ద్వారా గణనాథులను లండన్​కు తరలిస్తున్నమని, విగ్రాహలకు తరలింపుకు ఏలాంటి ఆవరోదకాలు లేకుండా వాటిని ఫ్టైట్​, కస్టం విభాగం అధికారులతో కలిసి వాటిని అతి జాగ్రతగా ప్యాక్​చేసి పంపుతున్నారు. పర్యవరణ హిత గణనాథులు సహాజసిద్దమైన బయో డిగ్రేడబుల్​ బంకమట్టితో తయారుచేస్తున్నారు. ప్రత్యేకంగా విటిలో బంతి పూల విత్తనాలు, వర్మికంపోస్టు నింపి వాటిని నిమజ్జన తరువాత వాడుకోవడానికి ఆవకాశం ఉంటుదని వారు తెలిపారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img