Homeసైన్స్​ & టెక్నాలజీOWL:గుడ్లగూబ చీకట్లో ఎలా చూస్తుంది .. తెలుసుకోవాలని ఉందా.

OWL:గుడ్లగూబ చీకట్లో ఎలా చూస్తుంది .. తెలుసుకోవాలని ఉందా.

OWL:

మనం అనేక రకాల పక్షులు చూస్తుంటాం. అందులో గుడ్లగూబ ఒక విచిత్రం. ఇది పగటి వేల కంటే రాత్రి సమయం లో స్పష్టంగా చూడగలదు. ఇది ఎలా సాధ్యం అనేది చాలా మందికి వచ్చే ప్రశ్న.
కొన్ని దేశాల్లో అప శకుని పక్షిగా భావిస్తే మరి కొన్ని దేశాలు శుభ శకునంగా భావిస్తారు. గుడ్లగూబ చూపు గురించి తెలుసుకునే ముందు మన చూపు ఎలా కనబడుతుందో తెలుసుకుందాం.
ఒక వస్తువు నుంచి వచ్చిన ప్రకాశం మన కండ్లలో ఉన్న దర్పణం ద్వారా కంటి తెర మీద పడుతుంది. ఈ కంటి తెరను రేటీనా అంటారు. ఈ రేటీనా మీద వస్తువు యొక్క ప్రతిబింబం తలకిందులుగా పడుతుంది.
అది మెదడు ద్వారా మన కండ్లకు స్పష్టంగా కనబడుతుంది.
గుడ్లగూబ విషయానికి వస్తే నాలుగు ప్రత్యేకతలు ఉన్నాయి.
దీని కంటిలోని దర్పణం మన కండ్లలోని రెటీనా, దర్పణాల మధ్య ఉన్న దూరం కంటే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వస్తు ప్రతిబింబం పెద్దదిగా కనబడుతుంది. దీని కంటిలో పెక్షన్ అనే ఒక ప్రత్యేక అంగం ఉంటుంది. అంతేగకుండా దీని కంటిలో రక్తనాలాల సంఖ్య అధికంగా ఉంటుంది. ప్రతి చదరపు మిల్లీ మీటరకు 10 వేల వరకు ఉంటాయి. మన కంటిలో రక్తనాళాల సంఖ్య కేవలం మిల్లీ మీటరకు 2 వేలు మాత్రమే ఉంటాయి. అందుకే మనకంటే గుడ్లగూబ 5 రెట్లు ఎక్కువగా చూడగలుగుతుంది. అంతేకాకుండా దీని కంటిలో ఎర్ర రంగు పదార్థం ఉంటుంది. దీనివల్ల గుడ్లగూబ కంటి ప్రకాశం మరింత పెరుగుతుంది. అదేవిదంగా దీని కంటి పాప ఎక్కువగా వ్యాపించగలదు. ఇన్ని లక్షణాలు ఉండటం వల్లే రాత్రిపూట చీకట్లో మంచిగా చూడకలుగుతుంది

Recent

- Advertisment -spot_img